Header Banner

ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు! ఏపీపీఎస్సీ కీలక సూచనలు!

  Sun Feb 23, 2025 10:59        Others

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే లోపలకు అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


పరీక్షా కేంద్రాల వద్ద తమ హాల్ టికెట్స్ సరిచూసుకుని తమకు కేటాయించిన పరీక్షా గదులలోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్-2 ప్రధాన పరీక్షల కోసం ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రిలిమ్స్ ద్వారా ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. గ్రూపు-2 మెయిన్ పరీక్షలకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేసింది. భారీ భద్రత నడుమ గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా.. ఏపీపీఎస్సీ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #group2 #exam #todaynews #rushinexam #centers #flashnews #latestupdate